రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని, రేవంత్ రెడ్డికి కొంచెమైనా నైతిక విలువలు ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. షాబాద్లో జరిగిన ఆరుగురి హత్యలు ముమ్మాటికీ పోలీసులు నిర్లక్ష్యం, ప్రభుత్వ తప్పిదాల వల్లే జరిగాయన్నారు. వీటిని ‘ప్రభుత్వ హత్యలు’గా పరిగణించాలని, గతంలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని, సీఎంకు కనీసం మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.