రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల్గూడ గ్రామంలో రాజ్ కుమార్ అనే పోక్సో నిందితుడు విచక్షణరహితంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. రాజ్ కుమార్ పై గతంలో షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. సీఐ, ఎస్సై స్పందించలేదని బాధితుల బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై రమేశ్ ను సస్పెండ్ చేసింది.సీఐపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.