దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంత్రి నారా లోకేష్ అక్కడ పర్యటించారు. దాదాపు 50కి పైగా ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. ఈ పర్యటన ద్వారా కొరియా కంపెనీలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. ఇది రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు శుభసూచకం. ఈ రోడ్ షో విజయవంతంగా ముగిసింది