‘హిట్, రన్ అండ్ ఎస్కేప్ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు. నేరపూరిత మనస్తత్వం ఉన్నవారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని.. ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకొని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. “ఇక్కడ సంఘటనలు చేయించి.. బెంగళూరు వెళ్లి దాక్కుంటున్నారు. ఏదో ఒక అరాచకానికి.. తెదేపా నేతలను ట్రాప్ చేయాలని చూస్తున్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా భోగాపురం విమానాశ్రయం పూర్తయింది. అమరావతి, పోలవరం, వెలిగొండ పూర్తవుతున్నాయి” అన్నారు.