హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసీ నది పక్కన ఉన్న డెకరేషన్ సామగ్రి గోడౌన్ లో శుక్రవారం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో గోడౌన్లోని డెకరేషన్ వస్తువులు కాలిపోయాయి. అలాగే, మెకానిక్ షాప్ కు మంటలు అంటుకోవడంతో పదుల సంఖ్యలో కార్లు దగ్ధమయ్యాయి. దట్టమైన నల్లపొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టి టీమ్ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేపట్టాయి.