SIR ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హైదరాబాద్ CP సీవీ సజ్జనార్ హెచ్చరించారు. ఓటరు వివరాల ధృవీకరణ పేరుతో మోసగాళ్లు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు అడిగే అవకాశం ఉందని, అలాంటి కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. BLOలు, ఎన్నికల సిబ్బంది పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మవద్దని, ఎన్నికల అధికారులు ఎప్పటికీ ఫోన్ ద్వారా ఓటీపీలు, బ్యాంకు వివరాలు లేదా ఇతర రహస్య సమాచారాన్ని అడగరని తెలిపారు.