రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్చన, రంజీ ప్రభాకర్ అనే ఇద్దరు కూలీలు మరణించారు. కరీంనగర్ జిల్లా కొదురుపాకకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ వరినాట్లకు మొత్తం 24 మంది వెళ్తున్నారు. వారు అనుపురం వద్దకు చేరుకోగానే వెనుక నుంచి ఆర్టీసీ అద్దె వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో దాదాపు పది అడుగుల దూరంలోకి ఎగిరిపడి పల్టీ కొట్టింది.