కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. గురువారం నాడు జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ గాజాలోని నుసైరాత్ శరణార్థి శిబిరాన్ని, అలాగే మరికొన్ని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. ఈ దాడుల సమయంలో ఒక జనావాస ప్రాంతంలో వెళ్తున్న కారుపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ వైమానిక దాడుల వల్ల పలువురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు.