ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో భాగంగా ఓటర్ ఎన్యూమరేషన్ ఫారంలు ఓటర్లకు ఇంకా అందలేదు. దీంతో సర్ పై జనం గుర్రుమంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పలు గ్రామాలలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫారంలు అందకపోవడంతో తమ ఓట్లు ఎక్కడ గల్లంత అవుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటర్ ఎన్యూమరేషన్ ఫారంలను తమకు అందజేయాలని ఓటర్లు కోరుతున్నారు.