భార్యను చంపి, గుర్తు తెలియన వారు చేసిన హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నార్నె అవినాష్ అనే తెలంగాణ యువకుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలో ఉన్న తన ప్రేయసి కోసం ఆ యువకుడు తన భార్యను చంపినట్లు తేలింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ పెళ్లికి ముందే ఇండియాలో ఒక యువతిని ప్రేమించాడు. పెళ్లి అనంతరం అమెరికా వెళ్లినా సరే.. అతడు ఆ ప్రేయసితో సంబంధాన్ని కొనసాగించాడు. ఆమె కోసమే ఈ హత్య చేసినట్లు తేలింది