ప్రశ్న రావణ్ అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తి అని.. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణకు అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. అందుకే రావణ్ టీడీపీ నేతల గురించి ఒక్క మాట మాట్లాడడం లేదని.. అందుకే అతడిపై ఆ పార్టీ వాళ్లు కేసులు పెట్టలేదన్నారు. రావణ్‌పై జనసేన పార్టీ నేతలు కేసులు పెట్టి ఆందోళనలు చేశారని.. టీడీపీ నేతలు ఆందోళనలు చేయలేదన్నారు.నచ్చని వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లలో తగలబెట్టించే టీడీపీ బూడిద పార్టీ అని కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.