మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా పలువురు నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు.వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వాహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. వైఎస్ జగన్‌తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు… వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.