కర్నూలు జిల్లా ఆదోని శివార్లలోని ప్రముఖ రణమండల ఆంజనేయస్వామి కొండపై ఉన్న శ్రీమునీశ్వరాలయ స్వామివారి దీపంతో సిగరెట్ వెలిగించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో, పోలీసుల విచారణలో నిందితుడిని ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్న (20)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈరన్న 2022లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న సమయంలో, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ వీడియో తీసినట్లు పోలీసులకు తెలిపాడు.