తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరుతూ కల్వకుంట్ల కవిత దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమకు ప్రత్యామ్నాయమైన పార్టీ పేర్లు చెప్పాలి తప్ప.. టీఆర్ఎస్ వచ్చే విధంగా ఎలాంటి పేరు ఉండొద్దని ఈసీ తెలిపిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈసీ నోటీసుకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని కవితకు సూచించింది. పిటిషన్ విచారణకు చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.

