తెలంగాణలో 3.10 కోట్ల (91.85 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ’ (SIR) పై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ రేపటితో పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన వాటిని డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. అతి తక్కువగా హైదరాబాద్లో 71.4 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 73.12 శాతం పంపిణీ జరిగిందన్నారు.