ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై తేదీ ఖరారైంది. జులై 13 నుంచి ఉద్యోగాల సృష్టి, అప్‌గ్రేడేషన్‌పై నిషేధం అమలు చేయనుంది. బదిలీలు, డిప్యుటేషన్, ప్రమోషన్లతో పాటుగా కొత్త నియామకాలపై నిషేధం విధించింది. ఈ నిషేధం స్థానిక కేడర్ల కేటాయింపు పూర్తయ్యే వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ఉత్తర్వు-2025 అమలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.