యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టును కోరారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పది రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును పోలీసులు కోరారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో రావణ్ ఉన్నాడు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్ పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని (ఉపా) సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు.