ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో డిఎస్పి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు మరియు ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఎసిబి అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లు ఎసిబి వెల్లడించింది.