తీవ్రరూపం దాల్చుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) భారత్‌ను మానవతా దృక్పథంతో సహాయం చేయాలని కోరింది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కమిటీ నాయకులు, పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆహారం, మందుల కొరత నెలకొన్న నేపథ్యంలో భారత్ అత్యవసర సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.