పశ్చిమ బెంగాల్లోని బారుఇపూర్ సమీపంలో ఆదివారం ఉదయం చెరువులో 12 ఏళ్ల మైనర్ స్కూల్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో శవమై లభ్యమవడం స్థానికంగా కార్చిచ్చు రేపింది. బాలికపై గ్యాంగ్ రేప్ చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేశారనే వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానికులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి హింసాత్మక నిరసనలకు దిగారు.అనుమానితుల్లో
ఒకడైన ఇంద్రజిత్ తాంతి అనే యువకుడిని గుర్తించిన గుంపు నడిరోడ్డుపైనే కొట్టి చంపింది మరో నిందితుడిని గుంపు బారి నుంచి రక్షించి, అనంతరం అరెస్ట్ చేశారు.