ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేవలం ఒక యూట్యూబర్ ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం దాదాపు 500 మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించిందని గుర్తు చేశారు. కానీ, తన కూతురిని పొట్టనబెట్టుకున్న అసలైన నిందితులు మాత్రం రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలు నగరంలో అత్యంత స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. “పేదవాళ్లం అయినందుకే మాపై ఈ వివక్ష చూపిస్తున్నారా?” అంటూ ఆమె పాలకులను నిలదీశారు.