రావణ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు నిందితుడిపై యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ చట్టం కింద కేసులు నమోదైతే దర్యాప్తు ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం రావణ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. యూఏపీఏ చట్టం ప్రకారం ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులకు ఆరు నెలల వరకు సమయం ఉంటుంది. నేరారోపణలు పూర్తిగా నిరూపణ కాకపోయినా ఈ సమయం వరకు నిందితుడిని జైల్లో ఉంచే అధికారం పోలీసులకు ఉంది.