ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలలో పాల్గొన్నందుకు భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, సాంస్కృతిక, మానవ సంబంధాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. జాతీయ సంతాప సమయంలో ఇరాన్ ప్రజల పట్ల పరస్పర గౌరవం, హృదయపూర్వక సంఘీభావానికి ఇది ఒక శక్తివంతమైన వ్యక్తీకరణగా కూడా నిలిచిందని అభిప్రాయపడింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ ఎంబసీ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టింది.