మెక్సికో సిటీలోని ఎత్తయిన ప్రాంత పరిస్థితులకు తట్టుకునేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు వయాగ్రా వాడుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఈ ఔషధంపై ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ నిషేధం లేకపోవడంతో ఆ ప్రచారం మరింత విస్తరించింది. మ్యాచ్ కు ముందు టుచెల్ మీడియాతో మాట్లాడుతూ.. వయాగ్రా వాడుతున్నట్లు సమాచారం తమ వద్ద లేదని, ఆ వార్తలు నిజం కాదని చెప్పారు.హెండర్సన్ కూడా స్పందిస్తూ.. సరదాగా వయాగ్రా ఉపయోగపడినట్లు చెప్పి ఉంటారని.. వెంటనే అది కేవలం జోక్ మాత్రమేనని స్పష్టం చేశాడు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపాడు.