ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్ (PK) ఎట్టకేలకు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బిహార్లోని ప్రతిష్టాత్మక ‘బాంకీపూర్’ అసెంబ్లీ నియోజకవర్గానికి జూలై 30న జరగబోయే ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్, స్వయంగా ఓ ఓటరు తీర్పును కోరడం ఇదే తొలిసారి. బీజేపీకి బలమైన కోటగా ఉన్న ఈ స్థానంలో పీకే పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.