చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నెల 1వ తేదీన విశాఖ తీరం నుంచి వీరంతా బోటులో వేటకు వెళ్లారు. అయితే, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పాటు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వీరిలో ఆరుగురు భోగాపురం ముక్కాం ప్రాంతానికి చెందినవారు కాగా, మరొకరు భీమిలికి చెందినవాసిగా సమాచారం. మెరైన్ పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.