జమ్మూ కాశ్మీర్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు అందించిన పుస్తకాలపై వివాదం మొదలైంది. ఆ పుస్తకాలలో తీవ్రవాదులను, వేర్పాటువాదులను గొప్ప వ్యక్తులుగా, లెజెండ్స్‌గా అభివర్ణించడమే ఇందుకు కారణం. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోని లైబ్రరీలకు ‘గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ (సిరీస్-4)’ పేరుతో కొన్ని పుస్తకాల్ని అందించారు. జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులను, ఉగ్రవాదులను పొగుడుతూ కంటెంట్ ఉన్నట్లు వెల్లడైంది. షాహిద్ మక్బూల్ భట్ ఉగ్రవాది పేరుతో ఉన్న చాప్టర్లో ఈ వేర్పాటువాద నాయకుడిని విప్లవకారుడిగా, షాహీద్ ఇ అజాంగా అభివర్ణించారు.