యూట్యూబర్ ప్రశ్న రావణ్ మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. కామెంట్లపై పర్యాటక శాఖ మంత్రి, కందుల దుర్గేశ్ స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రకాష్ రాజ్ కు ప్రతి నెలా ఎంత అందుతోందో చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్, రావణ్‌ల లు సమాజ విద్రోహ శక్తులని విమర్శించారు. వివాదాస్పద యూట్యూబర్ రావణ్ తో ప్రకాశ్ రాజ్‌కు ఉన్న చీకటి సంబంధాలేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.