ప్రధాని మోడీ ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకూ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజధాని మెల్ బోర్న్ లో ఓ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీని ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తామంటూ ఇవాళ హెచ్చరికలు వచ్చాయి. ఫేస్బుక్లో చంపేస్తామన్న బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫేస్బుక్ పోస్ట్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను అధికారులు గుర్తించారని ఆస్టేలియా టుడే తెలిపింది. అలాగే ఈ బెదిరింపునకు సంబంధించిన పరిస్థితులను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.