అమరావతి పేరుతో చంద్రబాబు అంతులేని అవినీతి, మోయలేని అప్పులు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. మావిగన్ పేరు చెప్పగానే కూటమి నేతల్లో భయం చుట్టుకుంటుందని విమర్శించారు. రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందో , ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి రూ. 50 వేల కోట్లు అప్పులు తెచ్చి ఆఫీసులు కడుతున్నారని పేర్కొన్నారు. రైతుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడు తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల వద్దకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.