రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాయలసీమలో ఏకంగా రూ. లక్ష కోట్లతో ‘హార్టికల్చర్ హబ్’ (ఉద్యానవన కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. “ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం కుప్పం రావాలి తప్ప.. ఇక్కడి నుంచి మరోచోటుకు వలస వెళ్లే పరిస్థితులు రాకూడదు” అని సీఎం ఆకాంక్షించారు. నియోజకవర్గంలో రూ. 9,320 కోట్లతో సుమారు 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నట్లు తెలిపారు.