చాలామంది తమ మనసులోని బాధలు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఆందోళనలు.. ఇలా జీవితంలోని అత్యంత వ్యక్తిగత విషయాలను ఇప్పుడు ChatGPT తో పంచుకుంటున్నారు. అయితే అలాంటి సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని భావించొద్దని Open AI CEO సామ్ ఆల్ట్‌మన్ హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో చాట్ రికార్డులు చట్టపరమైన విచారణల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని స్పష్టంచేశారు. ముఖ్యంగా యువత చాట్‌జీపీటీని థెరపిస్ట్ , లైఫ్ కోచ్ లా ఉపయోగిస్తోందన్నారు.

