జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోంది. షోపియాన్ జిల్లా చాన్పోర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన నిఘా వర్గాలు భద్రత బలగాలను అప్రమత్తం చేశాయి. దీంతో సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ చేస్తుండగా.. ఇద్దరు ముష్కరులను గుర్తించి జవాన్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించారు. మరో ఉగ్రవాది కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరణించిన ఇద్దరు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను జకీర్ గనాయ్, లతీఫ్ భట్గా గుర్తించారు.