యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో తనకు నాలుగో బెయిల్ వచ్చిన వెంటనే, వేంపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు ఐదోసారి తనను అరెస్టు చేసి నక్కపల్లికి తరలిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ తరహాలో తనను కూడా పోలీస్ స్టేషన్‌లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ మాట్లాడుతూ, తన గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోందని, కానీ ఒక రావణ్ ని చంపగలరేమో కానీ, ప్రజల్లో ప్రశ్నించే స్వభావాన్ని ఎవరూ చంపలేరని ప్రభుత్వానికి ఘాటుగా సమాధానమిచ్చారు.