ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయ కక్షతోనే రావణ్ పై 30 కేసుల వరకు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రావణ్ కు నాలుగో కేసులోనూ బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత అతడిని పోలీసులు మరో కేసులో అరెస్టు చేయలేదు. దీంతో, రావణ్ తన లాయర్ జడ శ్రవణ్ కుమార్ తో మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన మీడియా ప్రతినిధులకు, జడ్జిలకు, లాయర్ జడ శ్రవణ్ కు ధన్యవాదాలు తెలిపారు.