దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా పేరును ఏపీలోని ఒక జిల్లాకు పెట్టాలని ఆయన కుమార్తె ఆశ కిరణ్ కోరారు. శనివారం మోహన రంగా 79వ జయంతి సందర్భంగా విజయవాడలో ఆమె నివాళులర్పించారు. కృష్ణా తీరంలో గంగా స్మారక ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సభల్లో రంగపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని ,త్వరలోనే రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలిసి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని ఆశ కిరణ్ పేర్కొన్నారు.

