నెట్‌జీరో విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నలగంపల్లి గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుప్పం పర్యటన రెండో రోజు శనివారం నలగంపల్లిలోని నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తోన్న ఇళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి….సోలార్ రూఫ్‌టాప్ సోలార్, ఇండక్షన్ కుక్‌టాప్‌లు, వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి విధానాలను పరిశీలించారు. కడపల్లెలోని సీఎం నివాసం వద్దకు అభిమానులు, కుప్పం స్థానికులు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు సమస్యలపై వినతిపత్రాలు అందించారు.

