భారత ప్రభుత్వ వెబ్‌సైట్ల రూపురేఖలను మార్చే ప్రయత్నాలు, మాల్వేర్ చొప్పించే దాడులు అధికమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత కీలక మౌలిక వసతులు, ఆర్థిక సంస్థలు లక్ష్యంగా మారే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌పై లక్షల సంఖ్యలో సైబర్ దాడి ప్రయత్నాలు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో హ్యాకర్లు నెట్‌వర్క్‌ల్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. హమాస్‌కు మద్దతుగా ఉన్న కొన్నిహ్యాక్టివిస్ట్ గ్రూపులు కూడా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

