తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదమైన ‘శ్రీవారి లడ్డూ’ విక్రయాల్లో మునుపెన్నడూ లేని విధంగా
సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, గడచిన వేసవి సీజన్లో లడ్డూల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు అమ్ముడవ్వగా, మే నెల నాటికి ఆ సంఖ్య 1,21,35,528కి చేరింది. ఇక జూన్ నెలలో ఏకంగా 1,26,81,805 లడ్డూలు విక్రయమై సరికొత్త రికార్డు సృష్టించింది.