కపిల్ దేవ్ మాట్లాడుతూ.. వైభవ్ ఎంతో ప్రతిభావంతుడని ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే అతని గురించి ఇప్పుడే చాలా పెద్దగా మాట్లాడకుండా, కొంత సమయం ఇవ్వడం మంచిదని చెప్పారు. అతను ఇంకా చిన్న వయసులో ఉన్నందున అన్ని విషయాలను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. వైభవ్ లో కనిపిస్తున్న సహజ ప్రతిభను కపిల్ దేవ్ ప్రశంసించారు. ప్రతిభ పరంగా చూస్తే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల స్థాయిలో కనిపిస్తున్నాడని, టీ20ల్లో చూపిన ప్రతిభను మిగతా ఫార్మాట్లలో కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందని వివరించారు.

