కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు APIIC ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ‘రాయలసీమకు పూర్వోదయ ప్రాజెక్టును తెస్తాం. యువత ఉద్యోగాలు చేయడమే కాదు.. ఉద్యోగాలిచ్చే స్థితికి చేరాలి. నైపుణ్యాలు పెంచుకుని.. వినూత్నంగా ఆలోచిస్తే యువత అభివృద్ధి సాధ్యమవుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.