ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్‌ను కలిసి పలు కీలక విషయాలపై ముచ్చటించారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయంగా, సానుకూల వాతావరణంలో సాగిందని పవన్ కల్యాణ్ తన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని పేర్కొంటూ.. గవర్నర్ అందించిన అమూల్యమైన మార్గదర్శకత్వానికి, ఆయన చూపిన ఆతిథ్యానికి పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

