మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ- జీ-రామ్ జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలు చేయాలా.. వద్దా.. అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా చర్చ చేసింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన ఈ చట్టంలో ఉన్న వివాదాస్పద నిబంధనలపై మంత్రివర్గం తీవ్ర నిరసన తెలిపింది.