ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు చారిత్రాత్మక, సంక్షేమ నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మొదటి విడత పనులకు కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల మేర సాగే ఈ ఫేజ్-1 పనుల కోసం ఏకంగా రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌ను క్లియర్ చేయడంతో పాటు, ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 147 కొత్త పోస్టులను మంజూరు చేసింది.