సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు అయ్యారు. యాదగురిగుట్ట పాలకమండలి విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు గత రెండు రోజులుగా అటు ప్రభుత్వంలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండానే పాలకమండలి ఛైర్మన్, సభ్యులను నిర్ణయించి ప్రకటించడంతో సురేఖ కినుక వహించినట్లు చెబుతున్నారు. ఈ రోజు ఆమె విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చినా, మంత్రి వర్గ భేటీకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.