ఆంధ్రప్రదేశ్ పోలీసులపై.. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జర్నలిస్ట్ కేవీ రెడ్డి ఈ అరెస్టు సమయంలో.. ఏపీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కేవీ రెడ్డి భార్య విజయలక్ష్మీ కంప్లైంట్ ఇచ్చారు. బొబ్బిలి సీఐ శ్రీనివాస్‌పై కేసు పెట్టారు. అరెస్టు సమయంలో తనను పోలీసులు నెట్టి వేశారనీ, తీవ్ర పదాలతో దూషించారని విజయలక్ష్మీ ఆరోపించారు. బొబ్బిలి నుంచి సాధారణ దుస్తుల్లో, ప్రైవేటు వాహనంలో వచ్చి పోలీసులు కేవీ రెడ్డిని తీసుకెళ్లారు. స్థానికులుఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.