తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్(జీపీసీ)-2.0 నిర్మాణానికి
సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.750 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే రూ.1,600 కోట్లతో మోటార్ సైకిళ్ల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2018లో ఇక్కడ శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ అద్భుతంగా రాణిస్తోందన్నారు. 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ తయారయ్యాయని తెలిపారు. దేశంలో 25 శాతం పెట్టుబడులను ఏపీ ఆకర్షించిందని చెప్పారు.