నన్ను జైలులో పెట్టాడు. నేను అతణ్ని జైలులో పెట్టాలనుకుంటే అది నాకు నిమిషం పని. నాకు చేతకాకకాదు. అనుభవం లేక కాదు. నా ఉద్దేశం అది కాదు. నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి. ఏపీని కేరాఫ్ అడ్రస్ చేయాలి. అదీ నా ఉద్దేశం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.ఏపీ పునర్నిర్మాణానికి తాను, పవన్ కళ్యాణ్ కృషి చేస్తుంటే.. వైసీపీ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రోజుకో ఫేక్ వార్తను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.