నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో దొంగతనం చేసి రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో నిందితుడు ఉన్నట్టు పోలీసులకు తెలిపింది. నల్లగొండ సిసిఎస్ పోలీసులు నిందితుడి కోసం ఆదిభట్లలో గాలింపు చర్యలు చేపట్టారు. ఓఆర్‌ఆర్‌పై నిందితుడు కనిపించడంతో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర నుంచి సినీ ఫక్కీలో మాదిరిగా తప్పించుకుంటుండగా అతడిపై నల్గొండ పోలీసులు కాల్పులు జరిపారు. కాళ్లలోకి బుల్లెట్లు దిగడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని వనస్థలిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.