భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం “జాతీయ వైద్యుల దినోత్సవం” ( National Doctors’ Day) జూలై 1న జరుపుకుంటారు.డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ (1882 జూలై 1-1962 జూలై 1) జయంతి జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు.డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1 జూలై 1882 న జన్మించాడు. 1962 లో అదే తేదీన మరణించాడు.80 సంవత్సరాల వయస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది.